ప్రొ.నాగేశ్వర్: బిగ్‌బాస్‌ షోకి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు..?

కొన్ని రోజులుగా బిగ్‌బాస్ షో చూస్తున్నాను. ఎందుకంటే.. ఏ ఇంటికిపోయినా .. బిగ్ బాస్ షో గురించే చర్చ. ఎవర్ని కదిలించినా.. ఈ షోలో ఈ రోజు ఏం జరుగుతుందనే మాట్లాడుకుంటున్నారు. అడుగుతున్నారు కూడా. ! ఇందులో ఏం ప్రత్యేకత ఏముంది..?. అందరూ కలిపి ఓ రూంలో ఉంటారు. దీని కోసమే షో ఎందుకు అని కొంత మంది విమర్శిస్తూ ఉంటారు. కానీ ఒక సారి చూస్తే.. మళ్లీ వదిలి పెట్టరు. మళ్లీ మళ్లీ షో వచ్చే సమయానికి రెడీ అయిపోతారు. అంటే అడిక్ట్ అయిపోతారు. ఈ షో ఇంత పాపులర్ ఎందుకయింది..?

స్టార్ల వల్ల షోలు సక్సెస్ కావు..!
ఒక థీయరీ ఏమిటంటే… ఈ షోకి స్టార్లు హోస్ట్‌ గా అసోసియేట్ అవడం వల్ల ఈ షోకి పాపులారిటీ వచ్చిందంటారు. కానీ నిజం ఏమిటంటే… స్టార్లు అసోసియేట్ అయిన అన్ని షోలూ పాపులర్ కాలేదు. అలాగే ఇంకో కారణం కూడా చెబుతూంటారు. సమాజంలో పలుకుబడి ఉన్న కొంత మంది.. ఓ ఇంట్లో ఉంటారు కాబట్టి.. వారేం చేస్తారోననే ఆసక్తి జనంలోఉంటుంది కాబట్టి .. షోని ఎక్కువ మంది చూస్తూంటారని విశ్లేషిస్తూంటారు. నిజనికి ఈ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్లంతా పెద్ద స్టార్లేమీ కాదు. ఆడియన్స్‌ను కూర్చొబెట్టగలిగేంత స్టార్ డమ్ ఉన్న వాళ్లు కూడా కాదు. మరి ఎందుకు ఈ షో ఇంత పాపులర్ అవుతుంది. బిగ్ బాస్ ఒక్క తెలుగులోనే కాదు.. తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా..సక్సెస్ అయింది. దీనిపై నేను ఓ స్టడీ చేసే ప్రయత్నం చేశారు.

ఇతరుల ప్రైవేట్‌ లైఫ్ చూడాలనే ఆసక్తి..!
రియాలిటీ షోలు అన్నీ పాపులర్ అవ్వాలని లేదు. బిగ్‌బాస్‌కు ఉన్నంత ఆడియన్స్ క్రేజ్… ఏ షోకి లేదు. దీనికి ప్రధాన కారణం ఏమింటే.. మనషుల్లో సాధారణంగా ఓ ఉత్సుకత ఉంటుంది. ఇతరుల ప్రైవేటు లైఫ్ గురించి తెలుసుకోవాలి అనేదే ఆ ఉత్సుకత. మనకు కనబడని అంశాలను ఇంకా ఇంకా క్రేజీగా చూడాలనే ఆలోచన ఉంటుంది. నాయకులు, యాక్టర్ల ప్రైవేటు లైఫ్‌ల గురించి సామాన్య జనానికి పెద్ద ఎత్తున ఆసక్తి ఉంటుంది. పత్రికలు కూడా.. ఈ వార్తలు ఎక్కువగానే ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడా స్టేజ్‌ కూడా దాటిపోయింది. ఊదాహరణకు మన ఇంటి పక్కన వాతావరణాన్నే చూసుకుంది. ఇంటి పక్కన అమ్మలక్కలు తీరిక సమయంలో వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్లేం మాట్లాడుకుంటారు.? చుట్టుపక్కల వాళ్ల ప్రైవేటు లైఫ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. వాళ్లెవరూ ట్రంప్ – కిమ్ భేటీ గురించి మాట్లాడుకోరు. ఇది ఏపీ వాళ్లా, అమెరికా వాళ్లా లేక మరో దేశం వాళ్లా అన్నది కాదు. అందరికీ ఉండే ఆసక్తే ఇది. భాష, సంస్కృతి, సంప్రదాయాల్లో దేశదేశానికి తేడా ఉంటుంది. కానీ మానవునికి ఉన్న యూనివర్శల్ క్యారెక్టర్ ఏమిటంటే.. ఇతురల ప్రైవేటు జీవితాల్లోకి తొంగి చూడటం. బిగ్‌బాస్ షో ఆసక్తికరంగా మారడానికి ఇదో కారణం అయి ఉండవచ్చు.

ప్రేక్షకులు బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌తో పోల్చుకుంటారు..!
బిగ్‌బాస్‌లో…ఉండే వాళ్లంతా.. నిజ జీవితంలోలా వ్యవహరిస్తారు. కొంత మేరకు నటించవచ్చు. కానీ మొత్తం నటన కాకపోవచ్చు. ఒక ప్రత్యేక పరిస్థితులను సృష్టించి.. ఒకరికి ఒకరికి సంబంధం లేని వ్యక్తులను.. ఒకే ఇంట్లో ఉంచుతారు. వారి నిజజీవితంలో ఎలా ప్రవర్తిస్తారో… తెలుసుకోవాలనే క్రేజ్‌తో బిగ్‌బాస్ చూస్తున్నారేది ఓ థియరీ. సాధారణంగా మనుషులకు ఉదయం లేచినప్పుడు..తనకు ఎవరైనా వ్యక్తిగత పనులు చేసి పెడితే బాగుండనిపిస్తుంది. బిగ్‌బాస్ షోలో కెప్టెన్‌గా ఎంపికయిన వ్యక్తికి ఈ వెసులుబాటు ఉంటుంది. అతను చేయించుకుంటాడు. అంటే.. వాళ్ల ప్రైవేటు లైఫ్‌తో మన ప్రైవేటు లైఫ్‌ను పోల్చి చూసుకుంటారు. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతారు. వారితో ప్రేక్షకులు తమను తాము పోల్చుకుని ఆనందం పొందుతారు. నేనే కాదు..నా లాగే చాలా మంది బీహేవ్ చేస్తారని ఐడెంటిఫై చేసుకుంటారు. దాని వల్ల కూడా చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

బిగ్‌బాస్‌కి సూపర్ ఇగో, ఇగో, ఐడికి సంబంధం..!
సిగ్మండ్ ఫ్రాయిడ్ .. మనిషిలో ప్రవర్తలను మూడు రకాలుగా విభజిస్తాడు. సూపర్ ఇగో, ఇగో, ఐడీ. సూపర్ ఇగో బిహేవియర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇక .. మనిషికి ఉండే..స్వభావిక లక్షణాలు ఉండటమే ఇగో. ప్రతి మనిషిలో… కంట్రోల్ చేయలేని కొన్ని లక్షణాలు ఉంటాయి…అంటే.. డాన్స్ చేయడం, వేరే వారిని హింసించడం లాంటిని ఐడి అంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ఆ మనిషికి కూడా తెలియదు. ఈ ఐడిని సూపర్ ఇగో ఆపుతూ ఉంటుంది. బిగ్‌బాస్‌లో ఈ ఐడిని పార్టిసిపెంట్స్ ప్రవర్తన ద్వారా.. ప్రేక్షకులు చూస్తారు. దీన్ని చూడటం ద్వారా ఆనందం పొందుతారు. మీరు గమనించండి..బిగ్‌బాస్‌లో ఉన్న వాళ్ళు చాలా డిఫరెంట్‌గా ప్రవర్తిస్తూంటారు. ఎందుకలా బిహేవ్ చేస్తూంటారో మనకు తెలియదు. ఇక్కడ మనకు ఉంటుంది..మహారాణిగా కూర్చుని సేవలు చేయించుకోవాలని ఉంటుంది. నిజానికి చేయించుకోలేం. కానీ బిగ్‌బాస్‌లో క్యారెక్టర్లు అలా చేస్తూంటే చూసి ఆనందం పొందుతూంటాం. అంటే..బిగ్‌బాస్‌ షో ద్వారా మనలో ఉన్న సూపర్ ఇగో, ఇగోని పక్కన పెట్టి.. మన ఐడిని ..ఎక్స్‌పోజ్‌ చేయడం ద్వారా… బిగ్‌బాస్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ద్వారా విశ్లేషించుకోవచ్చు.

బిగ్‌బాస్ షోకి సంబంధించినంత వరకు కానీ ఇది ప్రాథమిక అంచనానే. లక్షల మందిని కూర్చొబెడుతున్న ఈ షోపై మరింత రీసెర్చ్ జరగాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.