ప్రొ.నాగేశ్వర్ : కాంగ్రెస్, బీజేపీకి కేసీఆర్ ప్రత్యామ్నాయం అవుతారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన కాంగ్రెస్, బీజేపీ మోడల్ దేశానికి అచ్చి రాలేదని.. కొత్త కాన్సెప్ట్ కావాల్సిందేనంటున్నారు. తాను తెచ్చి చూపిస్తానంటున్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అంటూ.. రాజకీయ ఆలోచనలు వెల్లడిస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం.. చివరి దశ సన్నాహాలు చేస్తున్న సమయంలోనే కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

జాతీయ ప్రత్యామ్నాయంపై కేసీఆర్ నమ్మకం ఏమిటి..?

భారతదేశంలో దాదాపుగా యాభై శాతం ఓటింగ్ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఉంటుంది. పార్టీలదే ఉంటుంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఉపఎన్నికల్లో తీసుకుంటే.. నాన్‌ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీలు… మంచి ప్రభావాన్ని చూపాయి. తెలంగాణలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ , బీజేపీలను.. ఓడగొట్టింది. సీట్లు పెద్దగా రాకపోయినా… ఓట్ల పరంగా.. చత్తీస్ ఘడ్‌లో బీఎస్పీ, అజిత్ జోగి పార్టీలు మంచి ఓటింగ్ సాధించాయి. కాంగ్రెస్ విజయాన్ని ఆపలేకపోవచ్చు కానీ… మొత్తానికే ప్రభావం చూపింది. అలాగే.. రాజస్థాన్‌లో బీఎస్పీ, ఇతర చిన్న పార్టీలు, మధ్యప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ సాధించిన ఓట్ల శాతం చూస్తూంటే.. దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అందువల్లే.. దేశంలో కాంగ్రెస్‌కు.. బీజేపీకి వ్యతిరేకంగా ఓ జాతీయ ప్రత్యామ్నాయం ఉందని… కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.

ప్రజల్ని ఐక్యం చేయడం అంటే ఏమిటి..?

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో… బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం కేసీఆర్ అనుకున్నంత ఈజీగా సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్న. ఎందుకంటే… 2019 ఎన్నికలకు ముందు.. ఇలాంటి ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ఆ మాటకొస్తే బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కూడా సాధ్యం కాకపోవచ్చు. ఏ కూటమి ఏర్పడినా.. 2019 ఎన్నికల తర్వాత అప్పటి ఫలితాలను బట్టి ఏర్పడవచ్చు. ఈ రెండు పార్టీలకు దూరంగా ఉన్న పార్టీలు.. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమిగా ఏర్పడినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఒక వేళ ఏర్పాటు చేసినా నిలబడదు. బీజేపీనో.. కాంగ్రెస్ పార్టీనో మద్దతు ఇవ్వాల్సిందే. అందువల్ల బీజేపీ నేతృత్వంలోనే… కాంగ్రెస్ నేతృత్వంలోనో… 2019లో ప్రభుత్వం ఏర్పడుతుంది తప్ప..మరో ఆప్షన్ లేదు.

నెల రోజుల్లో ఎలాంటి గుణాత్మక మార్పులు తీసుకొస్తారు..?

అయితే కేసీఆర్.. తాను… ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం లేదని.. విధానాల కేంద్రం ప్రజల్ని ఏకం చేస్తామని చెబుతున్నారు. ఇది మంచి లక్ష్యమే. విధానాల పరంగా ప్రజల్ని ఐక్యం చేయడం ఇంకా మంచిదే. కానీ… ప్రజలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేరు. ప్రజలు ఎన్నుకున్న పార్టీలు ప్రభుత్వాలను ఎంపిక చేస్తాయి. ప్రభుత్వాలు ఏర్పడేది.. ప్రజల ఐక్యతతో కాదు. పార్టీలకు వచ్చే సీట్ల వల్లే…! .అదీకాక… ఈ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీలు.. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అనుసరిస్తున్నాయా..? అంటే లేదని చెప్పుకోవాలి. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ కానీ. .. కాంగ్రెస్‌కు భిన్నంగా… బీజేపీకి భిన్నంగా వ్యవహరించడం లేదు. ఎవరితో అయినా కలిసే.. ఫ్లెక్సిబులిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పార్టీలతో..ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఎలా మనుగడ సాగిస్తారో కానీ.. ఇప్పటికైతే అసాధ్యం. నెల రోజుల్లో… దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చి చూపిస్తానంటున్న కేసీఆర్.. ఏ మార్పు తెస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.