పైసా వ‌సూల్.. ఈ స్పీడు స‌రిపోలేదు

మ‌రో రెండ్రోజుల్లో ‘పైసా వ‌సూల్’ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై బోల్డంత హైప్ ఉంది. కానీ ప్ర‌మోష‌న్ల‌లో స్పీడే క‌నిపించ‌డం లేదు. ఖ‌మ్మంలో ఆడియో ఫంక్ష‌న్ త‌ర‌వాత‌, ఆడియో స‌క్సెస్ మీట్ ఒక‌టి నిర్వ‌హించారు. మీడియాతో ఇంట్రాక్ష‌న్లే ఇంకా మొద‌లు కాలేదు. ఎప్పుడూ మీడియాతో మాట్లాడ‌డానికి ఉత్సాహ‌ప‌డే పూరి.. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వ‌ల్లో ఏమో.. మీడియా ఇంట‌ర్వ్యూలు అంటే కాస్త జంకుతున్నాడ‌ని టాక్‌. మ‌ళ్లీ డ్ర‌గ్స్ ప్ర‌శ్న‌ల‌తో త‌న‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తారేమో అని ఆలోచిస్తున్నాడ‌ట‌. బాల‌య్య ఇంట‌ర్వ్యూలు ఇస్తే ఇవ్వొచ్చు, లేదంటే లేదు. ఆయ‌న మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఆడియో విడుద‌ల‌కు ముందు వ‌చ్చిన స్టంప‌ర్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. అయితే ఆ త‌ర‌వాత ట్రైల‌ర్‌.. ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌ర‌వాత‌ మ‌రో బుల్లి టీజ‌రైనా విడుద‌ల చేయ‌లేదు. స్టంప‌ర్ టైపులో ట్రైల‌ర్ ఏమైనా క‌ట్ చేస్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకి సంబంధించి నిర్మాత ఆనంద ప్ర‌సాద్ ఫుల్ ఖుషీ. ఆయ‌న డ‌బ్బులు ఆయ‌న‌కు వ‌చ్చేశాయి, లాభాల‌తో స‌హా! పూరికి ఈ సినిమాతో బాగానే గిట్టుబాటు అయ్యింది. పైగా ఇప్ప‌టికే హైప్ పెరిగిపోయింది క‌దా అని సినిమా గురించి మాట్లాడ‌డం త‌గ్గించేశారేమో. మ‌రో స్టంప‌ర్ వ‌చ్చుంటే.. పైసా వ‌సూల్ స్పీడు ఇంకాస్త పెరిగేది, అభిమానులు ఖుషీ అయ్యేవారు క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com