డిజిట‌ల్ రైట్స్‌లో దుమ్ము రేపిన ‘లైగ‌ర్‌’

పూరి జ‌గన్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో త‌యార‌వుతున్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగ‌ర్‌`. విజ‌య్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మైక్ టైస‌న్‌ని బ‌రిలోకి దింప‌డం, పూరి మార్క్ యానక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తోడ‌వ్వ‌డం, విజ‌య్ కి ఉన్న క్రేజ్‌.. ఇవ‌న్నీ `లైగ‌ర్‌`కి హైప్ తీసుకొచ్చాయి. దాంతో పాటు బాలీవుడ్ లో ఈ సినిమాకి క‌ర‌ణ్ జోహార్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దాంతో… `లైగ‌ర్‌`పై భారీ అంచ‌నాలు మొద‌లైపోయాయి. దానికి త‌గ్గ‌ట్టే ఈ సినిమా నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడైపోయింది. దాదాపు రూ.98 కోట్ల‌కు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రెండూ హాట్ స్టార్ కొనేసింది. ఇది నిజంగా అదిరిపోయే రేటే!

ఈ సినిమాకి రూ.160 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ అయిన‌ట్టు తెలుస్తోంది. లాక్ డౌన్, క‌రోనా ఎఫెక్ట్ లేక‌పోతే… రూ.130 కోట్ల‌లోనే సినిమా పూర్త‌య్యేది. పెరిగిన వ‌డ్డీలు, షెడ్యూల్ మార్పులు, ఆర్టిస్టుల డేట్లు మ‌ళ్లీ స‌ర్దుబాటు చేయ‌డం.. ఇలాంటి వ్య‌వ‌హారాలతో బ‌డ్జెట్ పెరిగింది. అయినా స‌రే నిర్మాత‌ల‌కు ఏం ఇబ్బంది కాలేదు. నాన్ థియేట‌రిక‌ల్ నుంచే రూ.98 కోట్లు తెచ్చుకొందంటే, థియేట‌రిక‌ల్ నుంచి అంత‌కంటే ఎక్కువే ఆశించొచ్చు. రేపు ట్రైల‌ర్ వ‌స్తోంది. అది గ‌నుక పూరి స్టైల్ లో మాసీగా ఉంటే, ఈ సినిమా కొన‌డానికి బ‌య్య‌ర్లు మ‌రింత ఎగ‌బ‌డే అవ‌కాశం ఉంది. ఈమ‌ధ్య కాలంలో `లైగ‌ర్‌`కి జ‌రిగినంత బిజినెస్ ఏ సినిమాకీ జ‌ర‌గి ఉండ‌క‌పోవొచ్చ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. థియేట‌రిక‌ల్ రైట్స్ కూడా ఓ కొలిక్కి వ‌చ్చేస్తే.. `లైగ‌ర్‌` వాల్యూ ఎంత‌న్న‌ది అర్థ‌మైపోతుంది. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో లాభాలు గ‌డించిన పూరికి.. ఇది మ‌రో ప్రాఫిట్ ప్రాజెక్ట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close