పీజేఆర్ కొడుకు దూరమైతే.. కుమార్తెను కాంగ్రెస్‌లో చేర్చుకున్న రేవంత్

పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటుంటే… ఆయన కుమార్తె టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఖైరతాబాద్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి రెండు సార్లు మేయర్ సీటు ఆశించి భంగపడ్డారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా రాలేదు. దీంతో ఆమె కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆమెను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించగలిగారు. రేవంత్ రెడ్డిని కలిసి తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికారు.

మంచి భవిష్యత్తు కోసమే … పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాని మీడియాకు విజయారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతూండటం.. సొంత ఇంటి పార్టీ లోకి వస్తున్న అనే భావన ఉందన్నారు. టీఆర్ఎస్ లో అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించినా సరైన గుర్తింపు దక్కలేదని.. తనకు టీఆర్ఎస్ ఒక బౌండరీ గీశారని తన శక్తి సామర్థ్యాలుచాటాలంటే.. కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన వేదిక అని భావించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ రాలేదు. ఎన్నికలకు టైం ఉంది కాబట్టి టికెట్ గురించి ఇప్పుడే మాట్లాడని ఆమె ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నుంచి బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. పీజేఆర్‌కు అక్కడి బస్తీల్లో ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అన్న పేరుఉండేది. ఆ నియోజకవ్రగం విభజించాక.. ఆయన కుమారుడు జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. పీజేఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయనకు విజయారెడ్డి గట్టి పోటీ అవుతారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close