బీఆర్ఎస్‌తో సంబంధం లేదని చెప్పుకోవడానికి సజ్జల తంటాలు!

కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్‌పై మీ స్పందనేంటి అంటే.. చంద్రబాబు ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అడగకపోయినా స్పందిస్తున్నారు. జగన్ తరపున ప్రతీ సారి మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి.. బీఆర్ఎస్‌తో తమకు సంబంధం లేదని జాతీయ రాజకీయాల్లో అసలు తమ పాత్ర లేదని.. తమకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. భవిష్యత్ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలపై తమపై కామెంట్లు చేస్తున్నారేమో కానీ తాము మాత్రం ఆవేశపడబోమని.. తము పట్టించుకోమనిచెప్పుకొచ్చారు.

అయితే బీఆర్ఎస్‌పై ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ కేసీఆర్ విరుచుకుపడుతారేమోన కంగారు పడుతున్నారేమో ాకనీ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామన..
కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి మా పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చని సూక్తులు చెబుతున్నారు.కానీ ఏపీలో అడుగు పెట్టే ముందు.., తెలంగాణతో సంబంధమున్న అంశాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చే్యడం లేదు. కానీ మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామన్న కలరింగ్ మాత్రం తగ్గడం లేదు.

కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషకుల స్థానంలో లేమని.. మా రాష్ట్రం అభ్యున్నతి మాకు ముఖ్యమని.. ఏపీ మాత్రమే తమ వేదిక అని.. ఇక్కడ ప్రజల ఆశీర్వాదాలే కోరుతున్నామంటున్నారు.
పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదని… వాళ్ళు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి విమర్శలు ఎందుకని అంచున్నారు. భవిష్యత్తు రాజకీయాల గురించి వాళ్ళు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు… మేము ఇక్కడి వ్యవహారాలపై మాత్రమే కట్టుబడి ఉన్నామని సజ్జల చెబుతున్నారు. తమతో కలిసి నడవాలని కేసీఆర్ ఆహ్వానించినా.. వెళ్లలేక.. కేసీఆర్ ఆగ్రహాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక కంగారు పడుతున్నట్లుగా ఉన్నాయి సజ్జల మాటలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close