హమ్మ కోర్టుకెళ్తారా..? ఇక ధియేటర్ల వంతు !

ప్రభుత్వంపై కోర్టుకెళ్లినందుకు ఏపీలో ధియేటర్లకు సినిమా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమయిది. బూజుపట్టిన నిబంధనలన్నింటినీ దులిపి… ఆ రూల్ బుక్‌తో ధియేటర్లపైకి అధికారులు దండెత్తబోతున్నారు. ఏ చిన్న లోపం కనిపించినా సీజ్ చేసి.. రూ. లక్షల ఫైన్ వేసేందుకు రంగం సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వందల ధియేటర్లకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వకపోవడతో కొన్ని ధియేటర్ల యాజమాన్యాలు కోర్టులకు వెళ్లాయి.

హైకోర్టు జీవోను సస్పెండ్ చేసి.. పాత విధానంలోనే టిక్కెట్ రేట్లను ఖరారు చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పు కేవలం కోర్టుో పిటిషన్లు వేసిన ధియేటర్లకే వర్తిస్తుంది. ఇప్పుడు ఆ ధియేటర్లను మార్క్ చేసుకున్న ప్రభుత్వం… అధికారులతో దాడులకు రంగం సిద్ధం చేసుకుంది. అసలే కరోనా కాలం.. ఆ పైన టిక్కెట్ రేట్ల కుదింపుతో .. ఇక మూసివేతే మార్గమనుకుంటున్న దశలో ప్రభుత్వ వేధింపులు మరింతగా వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఏపీలో ఏ ఒక్క వ్యాపారవర్గం కూడా ప్రశాంతంగా తమ వ్యాపారాలను కొనసాగించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో మొత్తంగా ఆయా వ్యాపారాలకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టించేసింది. ఇప్పుడు ధియేటర్లనూ మూత వేస్తారని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ సారి ధియేటర్ల వంతు అని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close