గ్రేటర్‌కు గురి పెట్టి ముగ్గురికి ఎమ్మెల్సీలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన అనూహ్యంగా వేగం పెంచారు. గ్రేటర్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని గ్రౌండ్ క్లియర్ చేసుకోవడమే కాదు.. ఏదైనా సీట్లు తేడా పడితే.. మేయర్ సీటును దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. శరవేగంగా క్యాబినెట్ భేటీలో ఆమోదం తీసుకున్నారు. శనివారమే ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు.

కొత్త ఎమ్మెల్సీలుగా ప్రజా కవి గోరెటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ లను కేసీఆర్ ఎంపిక చేశారు. గోరటి వెంకన్న.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తన పాటలతో ఆయన ప్రజలను చైతన్యవంతం చేశారు. నేరుగా ఆయన టీఆర్ఎస్‌లో చేరకపోయినప్పటికీ.. ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చే ఉద్దేశంతో కేసీఆర్ ఆయనకు చాన్సిచ్చారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య… టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. పార్టీలో చాలా కాలం నుంచి పని చేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ కు కేసీఆర్ అనూహ్యంగా అవకాశం కల్పించారు.

ఇంత హఠాత్తుగా ముగ్గురు ఎమ్మెల్సీల్ని ఖరారు చేయడం.. ప్రమాణస్వీకారం చేయడం వెనుక.. గ్రేటర్ ఎన్నికల వ్యూహం ఉంది. వీరు ముగ్గుర్ని గ్రేటర్ ఖాతాలో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా చూపాలని కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి ఏమైనా ఓట్లు తక్కువ పడితే వీరి ఓట్లతో గట్టెక్కవచ్చన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. దీపావళి ముగిసిన తర్వాత రోజే… గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close