ఏపీ స్పెషల్ : టు శ్రీకాంత్.. ఫ్రం శ్రీకాంత్ లెటర్ !

సమస్యలు చెప్పుకోవడానికి ఓ వ్యక్తి లేఖ రాస్తాడు. ఎవరికి రాస్తాడు. ఎవరికి చెప్పుకోవాలనుకుంటున్నాడో వారికి రాస్తారు. సమస్యలు చెప్పుకోవాల్సిన వ్యక్తి.. పరిష్కరించాల్సిన వ్యక్తి ఒకరే అయితే ఏం చేస్తారు..? తమ పరిధి మేరలో సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ లేఖలు రాసుకుని.. వాటిని మీడియాలో ప్రచారం చేసుకుని ఏదో లక్ష్యం నెరవేర్చుకోవాలని ప్రయత్నించరు. కానీ ఏపీ ప్రభుత్వంలో పాలన అంతా… పేపర్లపై సాగుతూ ఉంటుంది. ఈ లేఖల ప్రసహసనం కూడా అంతే.

ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ పేరుతో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్‌కు ఓ లేఖ వచ్చింది.ఈ లేఖ సారాంశం ఏమిటంటే ట్రాన్స్ కో ఉద్యోగులు, యాజమాన్యం మధ్య అపోహలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ.. ఉద్యోగుల కోసం ట్రాన్స్‌కో ఏం చేస్తుందో.. ఎంత చేస్తుందో వివరిస్తూ ఆ లేఖ ఉంది. ట్రాన్స్ కో ఉద్యోగులకు ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ చేయాలి. అదే చేయడం లేదు. అందుకే ఉద్యోగులు రగిలిపోతున్నారు. వారికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్ కో యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు పోరుబాట పట్టే యోచనలో ఉన్నాయి.

అందుకే ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ పరిస్థితిని విమర్శిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్‌కు లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు కూడా అందుబాటులోకి వచ్చారు. పాపం శ్రీకాంత్‌కు ఎన్ని కష్టాలు వచ్చాయో అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ రాసిన లేఖ అందుకున్న ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ .శ్రీకాంత్ వేర్వేరు కాదు. ఒక్కరే. రెండు ఒకచోట ఇంటి పేరు పెట్టి.. మరో చోట షార్ట్ నేమ్‌తో లేఖలు రాశారు. దాంతో వేర్వేరు అనుకుంటారు. కానీ ఒక్కటే. అంటే.. శ్రీకాంత్‌కు.. శ్రీకాంత్ లెటర్ రాసి సమస్యలుచెప్పుకున్నారు. దాన్ని మీడియాలో వచ్చేలా చేసుకున్నారు. దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటో.. ఉద్యోగులు కుట్ర భావించే ప్లాన్లేమిటో ముందు ముందు బయటపడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close