“ఎన్టీఆర్ ఫ్యామిలీ”తో వైసీపీ రాజకీయాలు !

2023కి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయి. దీన్ని వైసీపీ హైజాక్ చేయాలని నిర్ణయించుకుంది. కొడాలి నాని నేతృత్వంలో ఇప్పటికే ప్లాన్ రెడీ అయిపోయింది. నిమ్మకూరులో నుంచి కొంత మందిని ఇటీవల కొడాలి నాని సీఎం వద్దకు తీసుకెళ్లారు. వారంతా ఎన్టీఆర్ కుటుంబసభ్యులని చెప్పి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎంకు ధన్యవాదాలు చెప్పించారు. అదే సమయంలో నిమ్మకూరు లో ఉన్న చెరువులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహన్ని పెట్టాలని కోరగా అందుకు సీఎం అంగీకరించారని ప్రకటించారు.

ఎన్టీఆర్ కు వందేళ్లు నిండిన సందర్భంగా మే లో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం అంగీకరించినట్లు కొడాలి నాని ప్రకటించారు. ఇప్పటికే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఎన్టీఆర్‌కు ఇచ్చిన గొప్ప గౌరవంగా ప్రచారం చేసుకునేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు వేడుకల్ని కూడా నిమ్మకూరులో అయినా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనను నిమ్మకూరుకే పరిమితం చేసినా రాజకీయంగా మైలేజీ తెచ్చుకోవడానికి చేయగలిగినంత చేయాలన్న తాపత్రయంలో ఉన్నారని అర్థమవుతోంది.

అయితే ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తే క్రమంలో సొంత ఓటు బ్యాంక్ మనోభావాలు దెబ్బకూడదన్న ఉద్దేశంతో కృష్ణా జిల్లా వరకూ ఆ ఉత్సవాలు ఉండేలా వైసీపీ చూసుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ను ఎన్నో సార్లు అవమానించినా.. ఎన్టీఆర్ విగ్రహాలు బద్దలు కొట్టినా ఎప్పుడూమాట్లాడని వైసీపీ నేతలు ఇప్పుడు విగ్రహాలు పెట్టిస్తామనే స్థాయికి వచ్చారంటే .. రాజకీయం ఎలా మారుతుందో అర్థమవుతోందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close