కాపులు క్యూ ని వెనక్కి నెట్టేస్తారా ? క్యూలో నిలబడతారా ?

( రాజకీయాల్లో కులాల కెమిస్ట్రీ-3 ) Click here for Part 1 Click here for Part 2 కాపులను బిసిలలో చేర్చాలన్న ముద్రగడ పద్మనాభం ఉద్యమం గ్రామగ్రామాలకూ విస్తరిస్తోంది. కాపుకులం లోని ఉపకులాలైన తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పుకాపుకులాల వారు సంఘటితులౌతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తూర్పుకాపులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మున్నూరు కాపులు బీసీల జాబితాలో వున్నారు. చంద్రబాబు నాయుడు హామీలు/ముద్రగడ డిమాండ్లు నెరవేరితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వున్న కాపు/తెలగ కులస్తులను, రాయలసీమలోని బలిజలను కూడా ఇప్పుడు బీసీ జాబితాలో చేరుస్తారు.ఇందుకు అవసరమైతే సుదీర్ఘకాలం ఉద్యమం చేసే కార్యక్రమాల గురించి మొత్తం 6 కాపుకులాల పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈ డిమాండుని వ్యతిరేకిస్తున్న బిసిలు, కాపు ఉద్యమం మాదిరిగా భారీ ప్రదర్శనలను నిర్వహించలేరు. ఎందుకంటే వెనుకబడిన తరగతులలో వున్న 135 కులాలు ఒకేసారి ఒకే వేదికమీదికి రావడం ఆర్ధికంగా, సామాజికంగా సాధ్యం కాదు. బీసీ రిజర్వేషన్‌ విధానం ప్రారంభమైనప్పుడు ఆ జాబితాలో కేవలం 87 కులాలు మాత్రమే వుండగా, క్రమంగా ఆ సంఖ్య ఇప్పుడు 135 కి పెరిగింది. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే బీసీ రిజర్వేషన్‌ లను అమలు చేసేవి. మండల్ కమిషన్‌ సిఫార్సుల మేరకు వి.పి.సింగ్‌ ప్రధానిగా వున్నప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఓబీసీల పేరిట రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబందించి నంతవరకూ బీసీలను ఎ, బి, సి, డి లుగా నాలుగు కేటగిరీలను విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు. ముస్లింలను కూడా బీసీల జాబితాలో చేర్చాక బిసిల్లో ‘‘ఇ’’ కేటగిరీ కొత్తగా చేరింది. ముస్లింలలో దోభి, అజామ్‌, పకీర్‌, అత్తరు సాయిబు, ఎలుగుబంట్లు ఆడించేవారు, మొదలైన వంశపారంపర్య / కుల వృత్తుల వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ముస్లింలలో అగ్రవర్ణంగా భావించే సయ్యద్‌, పటాన్‌, మహ్మద్‌ వంటి ఇంటి పేరు వున్నవారికి బిసి ఇ కేటగిరీ రిజర్వేషన్‌ వర్తించదు. ప్రస్తుతం వున్న బీసీ జాబితాలో మొండి, బండ, పాముల, బుడబుక్కల, వీరముష్ఠి వంటి సంచార జాతుల నుంచి రజక, నాయీ బ్రాహ్మణ వంటి సేవా కులాలు, గౌడ, యాదవ, పద్మశాలి, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ, మేదర వంటి ఉత్పత్తి స్వభావం కలిగిన వృత్తి కులాలు వున్నాయి. ప్రస్తుత బీసీ కులాలలో సంచార జాతులను మినహాయిస్తే ఇతర కులాలలో కొద్దిపాటి వ్యత్యాసాలు వున్నప్పటికీ సామాజికంగా ఒకే స్థాయిలో వున్నారని చెప్పవచ్చు. అయితే ఈ కులాలలో ఏ కులానికి కాపులు దగ్గరగా వుంటారు? కాపుల కుల వృత్తి ఏమిటి? కాపు సామాజికవర్గం వారు క్షురకర్మ చేసే నాయీ బ్రాహ్మణ, బట్టలుతికే రజకులతో, కల్లుగీసే గౌడలతో, కుండలు చేసే కుమ్మరిలతో, బుట్టలల్లే మేదర్లతో తమది కూడా సమాన సామాజిక స్థాయి అని అంగీకరిస్తారా? అని సామాజిక విశ్లేషకుడు అన్నవరపు బ్రహ్మయ్య ప్రశ్నించారు. 135 బీసీ కులాలలో 110 కులాల వారిలో ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. బిసిలలో చైతన్య పరంగా ముందున్న నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన (కుమ్మరి), మహేంద్ర(మేదర) వంటి కులాల్లో తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వుండాలన్న ఆకాంక్ష బలపడుతోంది. పోటీ చేసి గెలిచే సౌష్ఠవం వారిక లేదు. శాసన మండలిలో వారికి చోటివ్వవచ్చు. అయితే రాజకీయపార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎంపిక చేయడంలో పార్టీ అవసరాలు, ఎత్తుగడలు, కులాల కూడికలు తీసివేతలు మినహా సామాజికవర్గానికి ఏపార్టీకూడా అవకాశం ఈయడం లేదు.. అయితే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందువల్ల ఈ కులాల వారు అక్కడక్కడ మండల అధ్యక్షలుగా, జడ్పీటీసీలుగా ఎన్నికవుతున్నారు. కాపులను బీసీలలో చేరిస్తే ఈ మాత్రం అవకాశం కూడావుండదు. విద్య, ఉద్యోగ విషయాలలో మాదిరిగా ఎ,బి,సి,డి కేటగిరీలు రాజకీయాలలో లేవు. ఏదైనా ఒక పదవి బీసీలకు కేటాయించారంటే ఎన్నికల కమిషన్‌ దృష్టిలో బుడబుక్కల కులమైనా కాపు కులమైనా ఒకటే అవుతుందన్నారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంచుమించుగా కాపులు లేని గ్రామాలు లేవు. అంతేకాకుండా కాపు సామాజికవర్గం బీసీ కులాలతో పోల్చినప్పుడు ఆర్ధికంగా బలంగా వున్నారు. బీసీలకు కేటాయించే ప్రతి పదవిలో వారే ముందుంటారు. ఇప్పటికే ముస్లింలను బీసీల జాబితాలో చేర్చడం వల్ల అనేక ప్రాంతాల్లో గతంలో నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదర వంటి బాగా వెనుకబడిన కులాలవారి స్థానంలో ముస్లింలు ముందుకు వచ్చారు. కొత్తగా కాపులను బీసీలలో చేర్చే పక్షంలో గౌడ, గొల్ల, పద్మశాలి వంటి బీసీ కులాలవారి అవకాశాలకు కూడా కాపుల పరమైపోతాయని బ్రహ్మయ్య విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ లో 5 గురు కాపులు మంత్రులుగా వున్నారు…బిసిలలో 110 కులాల వారికి శాసన సభ అంటే ఏమిటో తెలియదు. కాపులను బిసిలలో చేర్చడం అంటే ఎప్పటినుంచో ఆకలితో క్యూలో వున్న వారిని వెనక్కి నెట్టేసి కడుపు నిండిన వారిని ముందుకి తీసుకురావడం లాంటిదేనన్నది బిసి నాయకుల అభ్యంతరం. మరి క్యూలో చివరగా నిలబడటానికి కాపు ఉద్యమ నాయకులు ఒప్పుకుంటారా? అన్నది ఒక ప్రశ్న అయితే బిసిల్లోనే వెనుకబడి వున్నవారి మాటేమిటన్నది మరో ప్రశ్న!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close