ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్‌… న‌ష్ట‌పోయింది ఎవ‌రు?

అజ్ఞాత‌వాసి ఆశ‌ల్ని ఆవిరి చేసింది. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబో అన‌గానే ఎగ‌సిప‌డిపోయిన బ‌య్య‌ర్ల న‌మ్మ‌కంపై గ‌ట్టి దెబ్బ కొట్టింది. ఆర్థికంగా ఎవ‌రెంత న‌ష్ట‌పోతార‌న్న లెక్క‌లు ప‌క్క‌న పెడితే… మాన‌సికంగా ఇది ఎవ‌రికి దెబ్బ‌? ఇటు త్రివిక్ర‌మ్ కా, అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ కా?

ప‌వ‌న్ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్నాడు. గోపాల గోపాల పెద్ద హిట్టేం కాదు. సోసోగా ఆడింది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. కాట‌మ‌రాయుడు ప‌రిస్థితి కూడా అంతే. `త్రివిక్ర‌మ్ సినిమాతో లెక్క‌లు స‌రిపోతాయి` అనుకున్నారంతా. ఎందుకంటే త్రివిక్ర‌మ్ పై అంత గ‌ట్టి గుడ్డి న‌మ్మ‌కం. పైగా ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ముందు వ‌స్తున్న సినిమా ఇది. ఈ సినిమా గ‌నుక హిట్ట‌యితే ప‌వ‌న్ స్టామినా ఏమిటో అటు రాజ‌కీయ వ‌ర్గానికీ తెలిసేది. ప‌వ‌న్ ఫ్యాన్స్ మంచి జోష్ మీద ఉండేవారు. ఇప్పుడు ఆ అవ‌కాశాలు పోయాయి. ప‌వ‌న్ సినిమా అయితే వంద కోట్లు, నూట యాభై కోట్లు కొడుతుంది స‌రే, ఫ్లాప్ అయితే మాత్రం అదే రీతిలో న‌ష్టాలు ఎదుర‌వుతాయి అని చెప్ప‌డానికి ఈసినిమా ఓ నిద‌ర్శ‌నంగా మిగ‌ల‌నుంది. త్రివిక్ర‌మ్‌కి ఇది కాక‌పోతే మ‌రోటి… ఎన్టీఆర్‌, వెంకీల సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో ఒక్క‌టి హిట్ట‌యినా చాలు. మళ్లీ ఫామ్ అందుకుంటాడు. ప‌వ‌న్ చేతిలో ఇప్పుడు పెద్ద ద‌ర్శ‌కులు లేరు. నేస‌న్‌, సంతోష్ శ్రీ‌నివాస్ ఇలాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ల‌కేం బ్ర‌హ్మాండ‌మైన చ‌రిత్ర లేదు. కేవ‌లం ప‌వ‌న్ స్టామినాతో బిజినెస్‌లు జ‌ర‌గాలి. ఒక విధంగా ఈ ఫ్లాప్ త్రివిక్ర‌మ్ కంటే ప‌వ‌న్‌పై నే ఎక్కువ ప్ర‌భావం చూపించే అవ‌కాశాలున్నాయి. త్రివిక్ర‌మ్ కూడా దీన్నో వార్నింగ్ బెల్‌గా భావించాల్సివుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.