నాని క్యూలో నలుగురు నిర్మాతలు

ఈ రోజు (శుక్రవారం) యువహీరో నాని పుట్టినరోజు. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజులకు సదరు హీరోతో సినిమా తీయాలనుకునే నిర్మాతల పుట్టినరోజు శుభాకాంక్షల ప్రకటనలతో ఆంధ్రజ్యోతి పత్రికలోని పేజీలకు పేజీలు నిండుతాయి. వరుస విజయాలతో ప్రేక్షకుల్లోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని కోసం నిర్మాతలు రెండున్నర పేజీలు ప్రకటనలు ఇచ్చారు. నాని క్రేజ్ ప్రతి ఏడాదికి ఎంత పెరుగుతుందో వీటిని చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రకటనల బట్టి నాని కోసం నలుగురు నిర్మాతలు క్యూలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. మహేశ్ బాబు, ఎన్టీఆర్ లతో సినిమాలు తీసి, ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నానికి అడ్వాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. భవ్య సంస్థ నాని కోసం ఫుల్ పేజి యాడ్ ఇవ్వడం విశేషం. ఈ రెండిటితో పాటు కొత్త నిర్మాణ సంస్థలు ‘కె.ఎఫ్.సి. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’, ‘నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌’ కూడా శుభాకాంక్షలు తెలిపాయి. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలు పూర్తైన తర్వాత ఈ నలుగురి నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేసే అవకాశాలు వున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.