“రంగమ్మ మంగమ్మా” కంటే మిన్నగా “ఓరయ్యో ఓలమ్మో”

పెద్ద అంచనాలు ఏమిలేకుండా విడుదలైన రంగస్థలం సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సాధించడం తెలిసిందే. విడుదలై నెలరోజులు దాటినప్పటికీ ఇప్పటికి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పాటకు పేరడీగా ఓరయ్యో ఓలమ్మో అంటూ విడుదలైన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ తమ యూట్యూబ్ అప్లోడ్ చేయడం విశేషం.

ఇంతకీ ఈ పాట లో ఏముందంటే – “ ఓరయ్యో ఓలమ్మో ఏం పిల్లడో ఇంతకాలం యాడ దాగే ఇంత నటుడు, సుకుమారుడు వచ్చి మంచి కథ చెబుతుంటే చిట్టిబాబు పాత్రలో లీనమై పోయే” అంటూ సాగే ఈ పాట పూర్తిగా రాంచరణ్ అభినందిస్తున్నట్లు గా సాగుతుంది. ఇంతకీ ఈ సాంగ్‌ను పేరడి చేస్తూ దుమ్ము రేపింది ఎవరో కాదు, నటుడు ఉత్తేజ్ చిన్న కూతురు పాట. పాట అన్న వెరైటీ పేరున్న ఈ చిన్నారి పేరుకు తగ్గట్టే స్వయంగా పాట పాడి, అభినయించి అదరగొట్టింది. ఉత్తేజ్ పెద్ద కుమార్తె చేతన ఈ పాటను డైరెక్ట్ చేయడమే కాకుండా శ్రీనాథ్‌తో కలిసి కొరియోగ్రఫీ కూడా చేసింది. అలాగే సినీ జర్నలిస్టు ప్రభు సాహిత్యాన్ని అందించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.