బాండ్ల పేరుతో ప్రభుత్వానికి శ్రీవారి నిధులు బదలాయింపు..!

రాష్ట్ర ప్రభుత్వ నిధుల కష్టాలు తీర్చేందుకు టీటీడీ సిద్ధమయింది. శ్రీవారి సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా చేసే బదులుగా ప్రభుత్వానికే వడ్డీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. మొదట సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ దానికి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అని సవరణ చేశారు. అంటే.. ఉద్దేశపూర్వకంగానే… శ్రీవారి నిధులను.. మళ్లించడానికి ఓ ప్లాన్ ప్రకారం ఇలా చేస్తూ వచ్చారని స్పష్టమవుతోంది.

శ్రీవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి మరీ ప్రభుత్వ బాండ్లను కొనే అవకాశం ఉంది. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లని చెబుతున్నారు కానీ.. టీటీడీ అసలు ఉద్దేశం మాత్రం ఏపీ సర్కార్ కి శ్రీవారి నిధులు మళ్లించడమేనని అంచనా వేయడం సులువే. ఏపీ సర్కార్‌కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆర్బీఐలో తీసుకోవాల్సిన రుణం పరిధి దాటిపోయింది.

ఎక్కడా అవకాశం లేకపోవడంతో.. శ్రీవారి నిధులపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం మరోసారి టీటీడీపై తీవ్రమైన వివాదం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీవారి భూముల అమ్మకంపై రేగిన వివాదంతో.. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని టీటీడీ లేదా.. ప్రభుత్వం తీసుకుంటుందా.. అన్న చర్చ కూడా జరుగుతోంది. టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని.. గత నెల పదిహేడో తేదీనే తెలుగు 360 వెల్లడించింది.

https://www.telugu360.com/te/ttd-funds-to-turn-into-ap-govt-bonds/

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close