బయ్యర్లను బయట పడేస్తుందా?

సాక్ష్యం చిత్రాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ, పంపీణి సంస్థ ఎరోస్ కొనుగోలు చేయ‌డం టాలీవుడ్ చిత్ర వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ మారింది. దాదాపు 45 కోట్ల భారీ వ్య‌యంతో సాక్ష్యం చిత్రం థియేట్రిక‌ల్ రైట్స్‌ను సొంత చేసుకుంది ఎరోస్ సంస్థ‌. ఈ సినిమా కోసం ముప్ఫై ఎనిమిది కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్లు నిర్మాత ఇటీవ‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా తెలిపారు. దాంతో నిర్మాత అభిషేక్ నామా టేబుల్ ఫ్రాఫిట్‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు అయింది. ఎరోస్ సంస్థ త‌మ‌కున్న బ్రాండ్ ఇమేజ్‌తో ఈ చిత్రాన్ని లోక‌ల్ బ‌య్య‌ర్ల‌కు ఫ్యాన్సీ రేట్ల‌కు విక్ర‌యించే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నాయి. అయితే చిత్ర క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌కున్న మార్కెట్ రేంజ్‌కు ఈ సినిమా ఏ స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతుంద‌నేది సందేహంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు చేసిన సినిమాల‌న్నీ నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే మిగిల్చాయి. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సాయి శ్రీ‌నివాస్‌ గ‌త చిత్రం జ‌య‌జాన‌కి నాయ‌క కోసం 42 కోట్లకుపైగా ఖ‌ర్చు చేశారు. తొలి వారంతోనే థియేట‌ర్లకు దూర‌మైన ఆ చిత్రం అతిక‌ష్టంమీదా 21 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. శాటిలైట్‌తో పాటు అన్ని ఇత‌ర హ‌క్కుల ద్వారా మ‌రో ప‌దివ‌ర‌కు నిర్మాతకు అందాయి. మొత్తం ప‌దికోట్ల‌కుపైనే నిర్మాత‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది గ‌త సినిమాల ఫ‌లితాల దృష్ట్యా సాక్ష్యం బ‌య్య‌ర్ల‌కు ఏ మేర‌కు లాభాల్ని తెచ్చిపెడుతందనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా హిందీ శాటిలైట్ హ‌క్క‌లు కూడా భారీ మొత్తంతో అమ్ముడైనట్లు తెలిసింది. ఏతావాతా తేలేదేమిటంటే..సాక్ష్యం చిత్రంతో అటు నిర్మాత‌లు, ఇటు ఎరోస్ సంస్థ లాభాల్లో పడ్డారు. ఇక తేలాల్సింది బ‌య్య‌ర్ల భ‌విత‌వ్య‌మే..మ‌రో వారం గ‌డిస్తే కానీ సాక్ష్యం బ‌య్య‌ర్ల‌కు గ‌ట్టెక్కిస్తుందా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.